ఇలా ఐతే ఎలా అనిల్ రావిపూడి ?

44
- Advertisement -

నటసింహం బాలయ్య బాబు సినిమా టైటిల్ అంటే ఎలా ఉండాలి?, టైటిల్ లోనే పౌరుషం కనబడేలా ఉండాలి కదా, ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో.. ఎలాంటి టైటిల్ ను ఇష్టపడతారో అనిల్ రావిపూడి తెలుసుకోకుండా బాలయ్య ‘NBK 108’ సినిమాకి టైటిల్ ను ఫిక్స్ చేశాడా?, ప్రస్తుతం ఇలాగే కామెంట్స్ చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. నిజానికి నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుంది అనగానే అందరూ ఆసక్తి చూపించారు. అనిల్ రావిపూడి ప్రస్తుతం ఫామ్ లో ఉన్న దర్శకుడు. పైగా మంచి మ్యాటర్ ఉన్న దర్శకుడు.

కాబట్టి, ఈ సినిమా పై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, ఆ అంచనాలను అనిల్ రావిపూడి అందుకునేలా కనబడటం లేదు. ఇంతకీ అనిల్ ఈ సినిమాకి టైటిల్‌ ఏం పెట్టాడో తెలుసా?, ‘భగవత్ కేసరి’. ఇదే టైటిల్ ను ఫిక్స్ చేశాడు. పైగా ఈ సినిమా పోస్టర్‌లో ట్యాగ్‌లైన్.. ‘ఐ డోంట్ కేర్’ అని ఉంది. ఈ ట్యాగ్ లైన్ ఉంది కాబట్టి.. బాలయ్య విశ్వరూపం చూపించనున్నాడని అర్థం చేసుకోవాలి అంటే ఎలా ?, మెయిన్ టైటిల్ లో మ్యాటర్ లేకుండా ట్యాగ్ లైన్ లతో కన్విన్స్ చేయాలంటే ఎలా కుదురుతుంది అనిల్ ?

నీ సినిమా కోసం బాలయ్య 62 ఏళ్ల వయసులో కూడా రిస్కీ షాట్స్ చేశాడు. నువ్వు కమర్షియల్ డైరెక్టర్ వి అని, నీకు మాస్ పల్స్ తెలుసు అని బాలయ్య ఫ్యాన్స్ కూడా నమ్మారు. అలాంటి నువ్వు భగవత్ కేసరి అని క్లాస్ టైటిల్ పెడితే ఎలా ?.. ఒకసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకో అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , శ్రీలీల కీలక పాత్రలలో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో లేడీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. ఇక బాలయ్య సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమాకి ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా, సిరామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Also Read: బన్నీ గర్ల్‌ ఫ్రెండ్‌ పై స్నేహరెడ్డి రియాక్షన్

- Advertisement -