వరుణ్ – లావణ్య పెళ్లి చాలా కాస్ట్లీ గురూ

126
- Advertisement -

వరుణ్ తేజ్-హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి చీరలో చాలా కుందనపు బొమ్మగా మెరిసింది లావణ్య. ఈ పెళ్లి వేడుకలో మెగా, అల్లు కుటుంబాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇదిలా ఉండగా..ఈ పెళ్లికి రూ. 15-17 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. విదేశాల్లో జరిగిన పెళ్లికే ఈ రేంజ్‌లో ఖర్చు పెడితే..హైదరాబాద్‌లో జరిగే రిసెప్షన్‌కి ఇంకెంత ఖర్చు చేస్తారో అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అన్నట్టు అలాగే ఈ పెళ్ళిలో లావణ్య ధరించిన పెళ్లి చీర గురించి నెట్టింట్లో ఒక వార్త హల్చల్ చేస్తోంది.

ఈ చీర ధర.. దాదాపు రూ. 7 నుంచి రూ. 10 లక్షల వరకు ఉంటుందని సమాచారం. లావణ్య రూబీ-ఎరుపు రంగు కాంచీపురం చీరలో, వరుణ్ క్రీమ్-గోల్డ్ షేర్వాణిలో కనిపించారు. అయితే వీరి పెళ్ళికి ఈ దుస్తులను డిజైన్ చేసింది మనీష్ మల్హోత్రా. అతను భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటాడు. అయినా ఇటలీలో వైభవంగా పెళ్లి జరిపించాలి అంటే ఆ మాత్రం ఖర్చు కాకుండా ఉంటుందా ? ఏమిటి. అన్నట్టు ఈ పెళ్లికి ఖర్చు మొత్తం అటు వరుణ్ తేజ్, ఇటు లావణ్య త్రిపాఠి ఇద్దరి కలిసి పెట్టుకున్నారట.

ఏది ఏమైనా వరుణ్ – లావణ్య త్రిపాఠి మూడు మూళ్లు వేసి, ఏడు అడుగులు నడిచి పెళ్లి జీవితాన్ని ప్రారంభించారు. ఇటలీలోని టస్కనీలో వీరి వివాహం జరగ్గా, ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు వరుసగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన ఫ్యాన్స్ చూడముచ్చటగా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read:ఎలక్షన్స్ కు షర్మిల గుడ్ బై.. ఆ భయంతోనే!

- Advertisement -