ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వరుణ్‌ తేజ్‌

193
varun tej

వరుస విజయాలతో మంచి జోష్ మీదున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్‌. ఫిదా,తొలి ప్రేమ సక్సెస్‌లతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వరుణ్..కొత్త జర్నీని మొదలుపెట్టాడు. ఈ మెగా హీరో క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు పలు సంస్థలు పోటీ పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ ప్రముఖ దుస్తుల సంస్థ ఆర్‌ఎస్ బ్రదర్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు ట్వీట్టర్‌లో ట్వీట్ చేసిన వరుణ్ తన కొత్త జర్నీ మొదలైందని తెలిపారు. ఆర్‌ఎస్ బ్రదర్స్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని తెలిపారు.

ప్రస్తుతం వరుణ్ ఘాజీ ఫేమ్‌ సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. స్పేస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వ్యోమగామిగా కనిపించనున్నాడు. ప్రత్యేకమైన శిక్షణ తీసుకుని మరీ ఈ సినిమా షూటింగులో వరుణ్ తేజ్ పాల్గొంటున్నాడు. ఈ సినిమాకు అంతరిక్షం అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి,అదితీరావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.