దటీజ్ మహాలక్ష్మిగా రాబోతున్నతమన్నా…

218
Tamanna
- Advertisement -

క్వీన్ రీమేక్ సెట్స్ లో హీరోయిన్ పరుల్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కన్నడ, తమిళ్, మలయాళం, తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ మైసూర్ లో శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ స్పాట్ లోనే పరుల్ యాదవ్ పుట్టినరోజు చిత్రబృందం నిర్వహించింది . ఈ వేడుకలో హీరోయిన్ తమన్నా, కాజల్ పాల్గొన్నారు. ఈ మూవీ తమిళ వర్షన్ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలో నటిస్తోంది.

Tamanna

దర్శకుడు రమేష్ అరవింద్ కన్నడ, తమిళ్ వర్షన్ క్వీన్ రిమేక్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ పరుల్ యాదవ్ మాట్లాడుతూ… ”ఇది నాకు స్పెషల్ పుట్టినరోజు. ఈ చిత్రానికి పని చెయ్యడం మర్చిపోలేని అనుభూతి” అన్నారు. క్వీన్ తెలుగు రీమేక్ లో తమన్నా మెయిన్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి “దటీజ్ మహాలక్ష్మి” పేరును ఖరారు చేసినట్లు తమన్నా తెలిపింది.

Tamanna

100% లవ్ చిత్రంలో తమన్నా పాత్ర పేరు “దటీజ్ మహాలక్ష్మి” తను మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రానికి అదే టైటిల్ పెట్టడం ఆనందంగా ఉందని మిల్కి బ్యూటీ తమన్నా చెప్పుకొచ్చింది. సిద్దు జొననలగడ్డ, జి.వి.ఎల్.నరసింహ రావ్, మాస్టర్ సంపత్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందింస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ గా అదితి అగర్వాల్, కెమెరా మెన్ మిట్చెల్ పని చేయనున్నారు. మెడీయంటి ఫిలిమ్స్ బ్యానర్ లో మను కుమారన్ ఈ చిత్రాన్ని నిర్మాస్తున్నారు.

- Advertisement -