ఎన్టీఆర్ బయోపిక్‎‎లో మీకు నటించాలని ఉందా..?

267
Casting Call For NTR Biopic

‎మహానటుడు, నాజకీయవేత దివంతగ మాజీ సీఎం ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తనయుడు నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్‌ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఇందులో ప్రధాన పాత్రల ఎంపిక పూర్తైన విషయం తెలిసిందే. అయితే మీకు ఈ సినిమాలో నటించాలని ఉందా..? మీరు ఒక్క అవకాశం అంటూ ఎదురుచూస్తున్నారా..? మీలో ఆ సత్తా ఉంటే [email protected] ఈ మెయిల్‎‎‎కి రెండు ఫోటోలు, మీరు పూర్తి వివరాలు పంపించండి.

నటిస్తూ తెరమీద కనిపిస్తూ జీవించాలనుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ మంచి అవకాశాలు రానివాళ్లు కొందరు, ఏది మంచి అవకాశమో అర్థం కాని వాళ్లు మరి కొందరు ఉంటారు. అలాంటివారి కోసం ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. ఎన్.బి.కె ఫిల్మ్ నిర్మాణంలో రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో ప్రాముఖ్యత గల కొన్ని పాత్రలకు కొత్తవారిని ఆహ్వానిస్తున్నాం. ఆసక్తి గల వారు రెండు ఫోటోలు పంపంచండి. అలాగే మీ సెల్ ఫోన్ లో మీ నటనతో కూడిన రెండు వీడియోలు 30 సెకండ్లు మించకుండా తీసి మాకు మెయిల్ పంపించాలని కోరింది.

https://twitter.com/NBKFilms_/status/1003961387851214848