- Advertisement -
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగశౌర్య సరసన రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్‌కు మంచి స్పందనరాగా సాంగ్‌కు అయితే ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 29న సినిమా విడుదల కానుండగా తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్‌ని పూర్తి చేసుకుంది.
ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు. త్వరలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచనున్నారు. నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
- Advertisement -