వారణాసి…పోలీస్ వర్సెస్ పసుపు రైతులు

226
varanasi

పసుపుకు మద్దతు ధర,పుసుపు బోర్డు ఏర్పాటుకోసం కొంతకాలంగా నిజామాబాద్ రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తమ సమస్యను జాతీయ స్ధాయిలో వినిపించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ పోటీచేస్తున్న వారణాసిలో నామినేషన్ వేసేందుకు పెద్దసంఖ్యలో రైతులు వారణాసి చేరుకున్నారు.

వారణాసికి చేరుకొన్న తమను స్థానికులు కొంత ఇబ్బంది పెట్టారనే రైతులు ఆరోపించారు. ఇప్పటివరకు 25 మంది రైతులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. గడువు ముగిసే సమయానికి మరో 25 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రైతులు నామినేషన్లు వేసేందుకు వీల్లేకుండా స్ధానిక బీజేపీ నేతలు, పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తుండగా స్ధానికుల నుండి మద్దతు లభిస్తోంది. నామినేషన్లకు ప్రతిపాదకులుగా ఉంటామని వారణాసి రైతులు మద్దతుగా నిలుస్తున్నారు. తెలంగాణతో పాటు ఏపీ,తమిళనాడుకి చెందిన రైతులు వారణాసి నుండి పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. 8 మంది ప్రకాశం రైతులు ,తమిళనాడు ఈరోడ్‌ ప్రాంతాకి చెందిన 15 మంది రైతులు నామినేషన్లు వేయనున్నారు.