జాతీయ గీతమైన జనగణమనకు, వందేమాతరం గీతాన్ని సమాన హోదా ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ గీతం జనగణమనకి వందేమాతరానికి సమాన గౌరవం హోదా కల్పించేలా మార్గదర్శకాలను రూపొందించెలా తగిన ఆదేశాలు ఇవ్వాలని దిల్లీ హైకోర్టులో కొన్ని రోజుల క్రితం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. భారత స్వాతంత్ర్య పోరాటంలో వందేమాతరానికి కీలక పాత్ర పోషించిందని పిటిషనర్, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వందేమాతరానికి కూడా జనగణమనతో సమానమైన గౌరవం ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. దీంతో దిల్లీ హైకోర్టు కేంద్ర హోం, విద్యా, సాంస్కృతిక, న్యాయ మంత్రిత్వ శాఖలకు దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై కేంద్రప్రభుత్వం స్పందిస్తూ… ఆ రెండింటికి సమాన హోదా ఉంటుందని వెల్లడించింది. దేశంలోని ప్రతి పౌరుడు ఈ రెండింటికి సమాన గౌరవం ఇవ్వాలని స్పష్టం చేసింది. అన్ని పాఠశాలలు విద్యాసంస్థల్లో ప్రతిరోజూ వందేమాతరం జనగణమన పాడేలా తగిన ఉత్తర్వులు ఇస్తామని కేంద్రప్రభుత్వం దిల్లీ హైకోర్టుకు తెలిపింది.
ఇవి కూడా చదవండి..