గ్యాంగ్‌స్టర్‌గా మహేష్..!

309
mahesh babu

సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబు…వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మూవీకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని తెలిపారు వంశీ.

2020 దసరాకు సినిమాను విడుదల చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు మహేష్. ఇక ఈ మూవీలో ప్రిన్స్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారట. అతడు,పోకిరి,బిజినెస్‌మెన్ వంటి సినిమాల్లో గ్యాంగ్ స్టర్‌గా మెప్పించిన మహేష్‌…మరోసారి అదే తరహా పాత్ర చేస్తుండటం ఫ్యాన్స్‌కి కిక్ ఇస్తోంది.

ఇక ప్రస్తుతం మహేష్ నటిస్తున్న 26వ మూవీ సరిలేరు నీకెవ్వరూ సంక్రాంతికి జనవరి 11న ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటికే ఒక్కొక్క అప్‌డేట్ ఇస్తున్న చిత్రయూనిట్ మరో సాంగ్ రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

Shooting for Mahesh Babu-Vamsi Paidipally film starts in DehradunDubbed as ‘Mahesh 25’, the film marks the first time collaboration between the actor and the director