వాహనదారులకు కేంద్రం తీపి కబురు..

208
validity of motor vehicle
- Advertisement -

కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా వాహన పత్రాల చెల్లుబాటు తేదీని కేంద్రం పొడిగించింది. వాహనాల ఫిట్నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సహా ఇతర వాహన సంబంధిత పత్రాల చెల్లుబాటును 2020 సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీలకు కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ అడ్వైజరీ పంపించింది. లాక్‌డైన్ నేపథ్యంలో వాహన పత్రాల చెల్లుబాటును ఇంతకు ముందు మార్చి 30 నుంచి జూన్ 30కి పొడిగించింది. ఇప్పుడు కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి వ్యాలిడిటీని పొడిగించింది. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు సెప్టెంబరు 30 వరకు చెల్లుబాటు అవుతాయని మంత్రి నితిగ్ గడ్కరీ ప్రకటించారు.

- Advertisement -