దుమ్ములేపుతున్న బాలయ్య కొత్త మూవీ టీజర్‌..

381
NBK 106
- Advertisement -

బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చాడు. బోయపాటి శ్రీను, బాలకృష్ణల కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిపిందే. అయితే బాలయ్య బర్త్‌ డే సందర్భంగా ఈ చిత్రం నుండి తాజాగా ఓ టీజర్‌ను విడుదల చేశారు. ఈ రోజు సాయంత్రం 7.09 నిమిషాలకు #BB3 నుండి వారు చెప్పినట్లుగానే ఫుల్‌ మాస్‌ టీజర్ వచ్చేసింది.

ఫస్ట్ రోర్ పేరుతో వచ్చిన ఈ టీజర్‌లో “ఎదుటివాడితో ఎలా మాట్లాడాలో నేర్చుకో!”… అంటూ బాలయ్య రౌద్రం ప్రదర్శించడాన్ని చూడొచ్చు. బోయపాటి మార్కు ఎక్కడా మిస్ కాలేదన్న విషయాన్ని ఈ కాస్త టీజర్ తోనే వివరించారు. బాలయ్య,బోయపాటి కాంబినేషన్‌లో సింహ, లెజెండ్ తర్వాత వస్తున్న ఈ మూడో చిత్రంపైనా భారీ అంచనాలున్నాయి.

- Advertisement -