LOVEలో ప్రియా

265
- Advertisement -

ప్రియా వారియర్…ఇప్పుడు ఈ పేరు తెలియని యువత ఉండరంటే అతిషయోక్తి కాదేమో. వారం రోజులుగా సోషల్ మీడియలో ట్రెండింగ్‌గా మారిన ఈ బ్యూటీ అందరి చూపును తనవైపు తిప్పుకుంది. తన కొంటెచూపులతో కుర్రాళ్ళ గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. దీంతో ఓవర్‌నైట్‌లో ఈ బ్యూటీ స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ఉహించని ఈ స్టార్ డమ్‌ని చూసి ప్రియా తెగ సంబరపడిపోతోంది.

ఇక వాలెంటైన్స్ డే కానుకగా ఈ మలయాళ బ్యూటీకి అదరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు ప్రముఖ కార్టునిస్ట్ ఇబ్రహీం బాదుషా. భాష‌తో సంబంధం లేకుండా కేవ‌లం ఎక్స్ ప్రెష‌న్స్ తోనే ఆక‌ర్షించిన ప్రియా ప్రతిబింబాన్ని అద్బుతంగా గీశాడు. తెల్ల పేప‌ర్ పై క‌న్నుగొట్టిన లుక్ లో తన లుక్ చూసి ప్రియ కూడా తెగమురిసిపోయిందట. ప్రియా ప్ర‌కాశ్ మొహాన్ని LOVE అనే నాలుగు అక్ష‌రాల‌తో సేమ్ టూ సేమ్ దింపాడు. ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

prya-ff
బాహుబ‌లి రిలీజ్ టైంలో సినిమా టైటిల్ తో పాటు ప్ర‌భాస్ స్కెచ్ గీసి టాలీవుడ్ అభిమానుల దృష్టిని ఆక‌ర్షించిన కార్టూనిస్ట్ ఇబ్రహీం బాదుషా. కోచికి చెందిన ఈయ‌న‌ ఎంద‌రో ప్ర‌ముఖుల ప్ర‌తిబింబాల‌ని అచ్చు గుద్దిన‌ట్టు తెల్ల పేప‌ర్ పై దించి ప‌లు ప్ర‌శంస‌లు అందుకున్నాడు.

Priya-varrier

- Advertisement -