రోషన్‌తో ఎఫైర్‌పై ప్రియా క్లారిటీ…

195
roshan priya

ఒకే ఒక్క కన్నుగీటుతో ఓవర్‌ నైట్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది ప్రియా వారియర్‌. ఓరు ఆదార్ లవ్ సినిమాలో ప్రియా కన్నుకొట్టిన విధానం,ఆమె హవాభావాలకు కుర్రకారు ఫిదా అయిపోయింది. అంతేగాదు లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీపై అప్పుడే రూమర్లు మొదలైపోయాయి.

‘ఒరు అడార్ లవ్’ సినిమా సమయంలో తన కో స్టార్ రోషన్‌తో ప్రియా ప్రేమలో పడ్డారని త్వరలో పెళ్లిచేసుకోబోతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా రోషన్‌కు డిఫరెంట్‌గా పుట్టినరోజు విషెస్ చెప్పింది ప్రియా. తన కోసం రోషన్ ఎంతో చేశాడని, అతడిపై మాటల్లో చెప్పలేనంత అభిమానం ఉందని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.

దీంతో వీరిపై రకరకాల పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలోనే రూమర్లకు చెక్ పెట్టింది ప్రియా. ఇద్దరం కలిసి ఒకే సినిమాతో పరిచయం కావడం, సేమ్ ఏజ్ గ్రూప్ కావడం వల్ల క్లోజ్ అయ్యామని అంతకుమించి తమ మధ్య ఏం లేదని స్పష్టం చేసింది. ఇండస్ట్రీలో రూమర్స్ కామన్ అని, తన పని తాను నిజాయితీగా చేసుకుంటూ పోతే కాలమే సమాధానం చెబుతుందని తెలిపింది. ప్రస్తుతం ప్రియా నటించిన బాలీవుడ్ మూవీ శ్రీదేవి బంగ్లా విడుదలకు సిద్ధంగా ఉంది.