పవర్ స్టార్,జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని తన నివాసంలో హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం వర్చువల్ పద్ధతిలోనే జనసేన పార్టీ కార్యకలాపాలను పవన్ కల్యాణ్ పర్యవేక్షిస్తున్నారు.త్వరలోనే తిరుపతి ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఆ స్థానంలో పోటీకి బీజేపీ-జనసేన తరఫున అభ్యర్థిగా రత్నప్రభ పోటీ చేస్తున్నారు.
ఎన్నికలకు ముందే పవన్ కల్యాణ్ సిబ్బందిలో కొందరు కరోనా బారిన పడడంతో పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటనపై సందిగ్ధత నెలకొంది. ఆయన కరోనా పరీక్షలు చేయించుకుని నెగటివ్ అని తేలితే మళ్లీ ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇక పవన్ నటించిన వకీల్ సాబ్ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా నడుస్తోంది.