గెలుపు కోసం బరితెగించిన బీజేపీ నేతలు..!

117
- Advertisement -

ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి దేశవ్యాప్తంగా వరుసగా విజయాలు సాధించడంలోనే కాదు..దొంగ ఓట్లు వేయడంలో కూడా బీజేపీ నేతలు పెద్ద తోపులని అసోం అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా బయటపడింది.దేశంలో జరుగుతున్న పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు కోసం మోదీ, అమిత్‌షాలు నానా తంటాలు పడుతున్నారు. పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడులో బీజేపీ ఓటమి ఖాయమైపోయింది. ఇక బీజేపీ ఆశలన్నీ అసోం, పుదుచ్చేరిలపై మాత్రమే. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా కూల్చిన బీజేపీపై పుదుచ్చేరి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు పుదుచ్చేరిలో బీజేపీకి ఎడ్జ్ ఉందని అంతా భావించారు.

అయితే ఎన్నికల సమయానికి ప్రజలు కాంగ్రెస్‌కే మరోసారి పట్టం కట్టబోతున్నారని తెలుస్తోంది. దీంతో అధికారంలో ఉన్న అసోంలోనైనా గెలవాలని బీజేపీ పలు అక్రమాలకు తెరతీసింది. అయితే అసోంలో కూడా బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. సీఏఏ, ఎన్నార్సీ చట్టాల విషయంలో అస్సామీలు బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు అసోంలో అధికార బీజేపీ అక్రమాలను ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీ ఇచ్చింది.దీంతో కాంగ్రెస్‌కు ఎడ్జ్ ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ పోలింగ్‌ రోజు పలు అక్రమాలకు తెరలేపింది. తొలిదశ పోలింగ్ ముగిసిన రోజునే స్థానిక బీజేపీ అభ్యర్థి కారులో ఈవీఎంలను తరలించడంపై పెద్ద రాజకీయ దుమారమే చెలరేగింది. ఈవీఎం ట్యాంపరింగ్‌లో రాటుదేలిన బీజేపీ, ఈసీతో కుమ్మక్కై ఇలాంటి అక్రమాలకు తెగబడిందని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. తాజాగా అసోం ఎన్నికలలో గెలుపు కోసం బీజేపీ చేసిన మరో కుట్ర కాస్త ఆలస్యంగా బయటపడింది.

దిమా హసవో జిల్లాలోని ఓ బూత్‌లో 90 ఓట్లు ఉండగా.. 181 ఓట్లు పోలయ్యాయి. ఏప్రిల్ 1న రెండో దశ పోలింగ్‌లో భాగంగా ఇక్కడ ఎన్నికలు జరిగాయి. హఫ్లంగ్ నియోజకవర్గంలోని ఈ బూత్ ఉంది. 2016లో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి బీర్ భద్ర హగ్జర్ గెలుపొందారు. ఇక్కడ 74 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్ల కంటే ఎక్కువ ఓట్లు పోలైన నేపథ్యంలో హప్లంగ్ నియోజకవర్గంలోని ఆ పోలింగ్ బూత్‌లో రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే రిజిస్టర్ అయిన ఓటర్లకే ఓటు వేసేందుకు అనుమతించామని, ప్రధాన పోలింగ్ స్టేషన్లో లేనివారిని కూడా అనుమతించామని ప్రిసైడింగ్ అధికారి అంగీకరించారని ఎన్నికల సంఘం తన ప్రకటనలో తెలిపింది.

ఈ క్రమంలో ఆరుగురు పోలింగ్ అధికారులను సస్పెండ్ చేసినట్లు ఈసీ ప్రకటించింది. అయితే అసలు విషయం ఇప్పుడు బయటపడింది. ఎన్నికల కమీషన్ ఇచ్చిన ఓటర్ల లిస్ట్ కాకుండా స్థానిక బీజేపీ సర్పంచ్ ఇచ్చిన కొత్త ఓటర్ల లిస్ట్ ప్రకారం అధికారులు పోలింగ్‌ను నిర్వహించారంట..హవ్వ నిజంగా ఎంతసిగ్గు చేటు. దీన్ని బట్టి ఎన్నికల కమీషన్‌ అధికారులతో కుమ్మక్కై ఎన్నికల్లో గెలుపు కోసం ఎంత అడ్డదారులు తొక్కుతుందో అర్థమవుతోంది. అసోం ఎన్నికల్లో జరుగుతున్న చిత్రాలు చూస్తుంటే.. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని నిలువుగా పాతరేస్తుందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడున్నారు. మొత్తంగా ఎన్నికల కమీషన్‌ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా ఉన్నంత కాలం ఇలా దేశంలో కమలం పార్టీ గెలుస్తూనే ఉంటుంది. బీజేపీ విజయరహస్యం అంటే ఇదేనేమో.

- Advertisement -