సామాజిక దార్శనికుడు పూలే- మంత్రి హరీష్‌

35
Minister Harish Rao

సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే.. ఆశయ సాధనే పూలేకు అసలైన నివాళి అన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు. ఈరోజు పూలే జయంతి సందర్భంగా సిద్దిపేట పాత బస్టాండ్ కూడలిలో మహాత్మా జ్యోతి రావు పూలే 195వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌ రావు పాల్గొని మాట్లాడారు.. పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవాతావాది పూలే అని మంత్రి అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు.

EyrmwSjVcAE8tXK