వజ్ర శ్రీ ఫిలిమ్స్ , జి. బి మూవీస్ పతాకం పై ప్రొడక్షన్ నెంబర్.1 గా మరిడి శ్రీనివాస్ నిర్మాతగా పరిచయం అవుతూ మాల్యాద్రి మామిడి ( ప్రదీప్) దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ కొత్త చిత్రం మొదలు కానుంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ మరిడి శ్రీనివాస్ మాట్లాడుతూ…నేను గతంలో సినిమా రైటర్‌గా అవకాశాల కోసం ట్రై చేశాను కానీ అప్పట్లో కుదరలేదు. తరువాత మా బిసినెస్ వర్క్స్ ఉండి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు అదే ఫ్యాషన్‌తో సినిమా తీయాలి అని అనుకుంటున్న సమయంలో నాకు మాల్యాద్రి మామిడి కలవడం జరిగింది. నాకు ఆయన చెప్పిన స్టోరీ చాలా బాగా నచ్చింది. స్టోరీ వింటున్నంత సేపు నెక్స్ట్ ఏమి జరగబోతుంది అనే సస్పెన్స్ ఎలిమెంట్స్ ఈ కథలో కనిపించింది. ఇక ఫ్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్నాము. అలాగే వజ్ర శ్రీ బ్యానర్లో ఈ చిత్రం కాకుండా మరికొన్ని చిత్రాలు బడ్జెట్లో నిర్మించాలని అనుకుంటున్నాము అని తెలిపారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాల్యాద్రి మామిడి (ప్రదీప్) మాట్లాడుతూ.. వజ్ర శ్రీ ఫిలిమ్స్, జి. బి మూవీస్ బ్యానర్లో నా మొదటి సినిమా చేయబోతునందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత మరిడి శ్రీనివాస్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను కథ చెప్పగానే శ్రీనివాస్ సింగిల్ సిటింగ్ లోనే ఈ కథని, దర్శకుడిగా నన్ను ఓకే చేశారు. బడ్జెట్ విషయానికి వస్తే.. అనుకున్న దానికంటే ఎక్కువే అవుతుంది అని చెప్పినా ఎక్కడ వెనకడకుండా నువ్వు ముందు మిగతా పనుల్లో ఉండు అని నాకు ధైర్యనిచ్చారు.
మా మూవీ హీరో హీరోయిన్ విషయానికి వస్తే హీరోగా ఒక మూవీలో ప్రూవ్ చేసుకున్న ప్రముఖ యుంగ్ బ్యూటిఫుల్ హీరోని సెలక్ట్ చేయడం జరిగింది. వెంటనే కథ అనుగుణంగా బాడీ వర్కవుట్ చేస్తున్నారు. ఫుల్ గా రెడీ అయ్యాక ఫస్ట్ లుకతో హీరోని అనౌన్స్ చేద్దామని ఇప్పుడు ప్రకటించడం లేదు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే. ఈ చిత్రం ద్వారా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ని తెలుగులో పరిచయం చేస్తున్నాము. హీరో హీరోయిన్ కెరెక్టర్ ఆర్టిస్ట్స్ మరియు టెక్నిషన్స్ని త్వరలో ప్రెస్ మీట్లో మీకు పరిచయం చేస్తాము అని దర్శకుడు చెప్పారు. ఈ సందర్బంగా డా,, బాలరాజ శేఖర్ మాట్లాడుతూ మా శ్రేయోభిలాసులు శ్రీనివాస్, ప్రదీప్ ఈరోజు మూవీ అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తన శుభాకాంక్షలు తెలిపారు.