‘శైల‌జా రెడ్డి అల్లుడు’ వీడయో సాంగ్‌..

186
Shailaja Reddy Alludu Movie

అక్కినేని నాగ చైతన్య – అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లు గా మారుతి తెర‌కెక్కించిన చిత్రం ‘శైల‌జా రెడ్డి అల్లుడు’. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ రూపొందిస్తుంది. ఇటీవ‌ల‌ ర‌మ్య‌కృష్ణ‌కి సంబంధించిన స‌న్నివేశాలతో పాటు మిగ‌తా షూటింగ్ కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమాను ఆగ‌స్ట్ నెలాఖ‌రులో విడుద‌ల‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. శైల‌జా రెడ్డి చిత్రం కుటుంబ క‌థా చిత్రంగా ప్రేక్ష‌కుల‌ని తప్ప‌క అల‌రిస్తుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. తాజాగా మూవీ నుండి ‘అను బేబీ’ అనే ఈ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు చిత్ర బృందం.

Shailaja Reddy Alludu Movie

ఈ పాటను కృష్ణ కాంత్ రచించగా అనుదీప్ దేవ్ సింగర్ ఆలపించారు. గోపిసుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఈ పాటకు డాన్స్ మాస్టర్ శేఖర్ కొరియోగ్రఫీ అందించాడు. చూస్తుంటే ఫస్ట్ సాంగ్ ఆడియన్స్ ను మెప్పించేలానే ఉంది. దర్శకుడు మారుతి ఫన్ మార్క్ ఈ సాంగ్‌లో కనిపించడం కావడం విశేషం.

రమ్య కృష్ణ పవర్ ఫుల్ అత్తగారి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఫుల్ ఈగో ఉన్న కూతురిగా అను నటిస్తోంది. ఈ పాట చూస్తుంటే అటు అత్తగారిని ఇటు ఈగో పిల్లని దీటుగా ఎదుర్కొనేలా ఉన్నాడు ‘శైల‌జా రెడ్డి అల్లుడు’. ఇక ఆలస్యం ఎందుకు ఈ సాంగ్‌ని చూసి మీరూ ఎంజయ్‌ చేయండి.