మోడీ కథ అప్పుడే ముగిసిపోయేది..!

350
modi
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై మరోసారి సంచనల వ్యాఖ్యలు చేశారు బీజేపీ మాజీ నేత,మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా. 2002 గోద్రా అల్లర్ల సందర్భంగా అప్పటి సీఎం మోడీతో రాజీనామా చేయించాలని నాటి ప్రధాని వాజ్‌ పేయి భావించారని చెప్పారు. ఒకవేళ మోడీ రాజీనామా చేయడానికి నిరాకరిస్తే గుజరాత్ ప్రభుత్వాన్ని రద్దు చేద్దామనుకున్నారు కానీ అద్వానీ అడ్డుపడ్డారని చెప్పారు.

మోడీని తప్పిస్తే.. తాను కేంద్ర హోంమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆద్వాణి బెదిరించారని దీంతో వాజ్ పేయి వెనక్కి తగ్గారని చెప్పారు. లేకుంటే మోడీ కథ అప్పుడే ముగిసిపోయేదని చెప్పారు. ప్రధానిగా ఉన్న సమయంలో రాజీవ్ ఐఎన్‌ఎస్‌ను దుర్వినియోగం చేశారన్నది అసలు అంశమే కాదని కొట్టిపారేశారు. ఈ విషయంపై ఇప్పటికే నేవీ మాజీ అధికారులు సైతం వివరణ ఇచ్చారని చెప్పారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆ పదవికి శోభనివ్వదన్నారు.

లోక్‌సభ ఎన్నికలు మోడీ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా జరుగుతున్నాయని దేశ చరిత్రకు సంబంధం ఏముందని యశ్వంత్ పేర్కొన్నారు. పాకిస్తాన్ సమస్యను ఎన్నికలలో ప్రస్తావించడం దురదృష్టకరమని, పాక్ ఏమైనా మన దేశంలో అంతర్భాగమా అని ప్రశ్నించారు.

- Advertisement -