‘ఉప్పెన’లా వస్తున్న మెగాహీరో..

199

మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్.. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది.

Vaishnav Tej

జాలర్ల నేపథ్యంలో ఎమోషనల్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ప‌లు టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఆ మ‌ధ్య జాల‌రి అనే టైటిల్‌ని చిత్రానికి ఫిక్స్ చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌ర‌గ‌గా, తాజాగా ఉప్పెన అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు ఈ టైటిల్‌ను చిత్ర నిర్మాతలు రిజిస్టర్ చేయించారట. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే వెల్లడించనున్నారు.