వైకుంఠపురంలో అల్లు అర్జున్…!

407
allu arjun vykuntapuramlo

మాటల మాంత్రికుడు త్రివిక్రమ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15 సందర్భంగా టైటిల్‌ని రివీల్ చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. అయితే టీ టౌన్‌లో ఇప్పటికే సినిమా టైటిల్‌ లీకైపోయినట్లు సమాచారం.

అల్లు అర్జున్ 19వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుండగా వైకుంఠపురంలో అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గత సినిమాలకు భిన్నంగా అతో ప్రారంభమయ్యే సెంటిమెంట్‌ని పక్కకు పెట్టి ఈ మూవీకి టైటిల్‌ని త్రివిక్రమ్ ఫైనల్ చేశాడట. అతడు,అత్తారింటికి దారేది,అ..ఆ,అరవింద సమేత సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి.

అయితే బన్నీతో జులాయి,సన్నాఫ్ సత్యమూర్తి సందర్భంగా అ సెంటిమెంట్‌ని పక్కకు పెట్టిన త్రివిక్రమ్‌..తాజాగా అదే ట్రెండ్‌ని ఫాలో అయినట్లు తెలుస్తోంది. ఇందులో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తుండగా వైకుంఠపురం అనే టైటిల్‌ అయితే కథకు సెట్ అవుతుందని ఫిక్స్‌ అయ్యాడట.

అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్కినేని సుశాంత్ , నవదీప్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.