చిరంజీవి ఇంటి ముందు ఉయ్యాలవాడ కుటుంబ సభ్యుల ఆందోళన

490
Chirajeevi
- Advertisement -

మెగాస్టార్ చిరంజివి ప్రస్తుతం సైరా సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రానికి ప్రముఖ దర్శకుడు సురెందర్ రెడ్డి దర్శకత్వం వహించగా…మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

అయితే తాజాగా చిరంజీవి ఇంటి ముందు ధర్నాకు దిగారు ఉయ్యాలవాడ కుంటుంబ సభ్యులు. సినిమా కోసం తమ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకొని ఫ్యామిలీకి ఆర్థికంగా సహాయం చేస్తామని చెప్పి ఇప్పుడు గేటు లోపటికి కూడా రానివ్వడం లేదని చెబుతున్నారు. సినిమా కథ కోసం సొంత ఊళ్లకు వచ్చి తమ ప్రాపర్టీలను సైతం షూటింగ్ కోసం వాడుకున్నట్లు చెప్పారు. నిర్మాత రామ్ చరణ్ ను కలవాలని వస్తే తమకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు.

- Advertisement -