పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా…

68
utham kumar

పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గ్రేటర్ ఎన్నిక‌ల్లో ఓట‌మికి నైతిక బాధ్య‌త వహిస్తూ రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపారు.

శుక్రవారం వెల్లడైన గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. ఫిబ్రవరి 2015 నుంచి ఉత్తమ్‌ టీపీసీసీ అధ్యక్షుడిగా కొన‌సాగుతున్నారు. ప్రస్తుతం ఆయన నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.