బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 90 హైలైట్స్

62
episode 90

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 90 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఈ ఎపిసోడ్‌లో భాగంగా రేస్ టూ ఫినాలేలో అఖిల్ గెలుపొందగా వరెస్ట్ పర్ఫామర్‌గా నిలిచిన అభిజత్ జైలు పాలయ్యాడు.

రేస్ టూ ఫినాలే టాస్క్‌లో భాగంగా అఖిల్ – సోహైల్‌లు ఉయ్యాలలో కుర్చునేందుకు నానా కష్టాలు పడ్డారు. ఉదయాన్నే అభిజిత్.. సొహైల్, అఖిల్ దగ్గరకు వచ్చి ఇద్దరూ ఆలోచించుకోండి అని చెప్పాడు. దీంతో అఖిల్ ఓపెన్ అయ్యి.. ఈ గేమ్ ఇద్దరికీ ఇంపార్టెంటే.. నాకు మైండ్‌లో ఏముందంటే.. మా అమ్మ వచ్చి కెప్టెన్ అవ్వు అని అడిగినా నేను కాలేకపోయా. నేనే టాప్‌లో ఉంటానా అని మా అమ్మని అడిగా అని సెంటిమెంట్‌తో కొట్టగానే కరిగిపోయిన సొహైల్ ఉయాల దిగేందుకు ముందుకొచ్చాడు.

అయితే ఈ క్రమంలో ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకుని గట్టిగా ఏడ్చేశారు. తర్వాత ఏం చేద్దాం అని అఖిల్ అడగడంతో.. నాకేం అర్థం కావడం లేదు అఖిల్.. నువ్ నన్ను తమ్ముడిలా తీసుకున్నావ్ అని సొహైల్ ఎమోషనల్ కావడంతో అఖిల్ ఇంకా ఎక్కువ ఏడ్చేశాడు. చివరికి సొహైల్ అఖిల్ కోసం త్యాగం చేసి ఉయ్యాల దిగిపోయాడు.మొత్తంగా అఖిల్ టికెట్‌ టు ఫినాలే మెడల్ సాధించి టాప్ 5కి వెళ్లాడు. ఈ టాస్క్ విజేత అఖిల్ కావడంతో బిగ్ బాస్ సీజన్ 4లో మొదటి ఫైనలిస్ట్ అయ్యాడని…ఈవారం ఎలిమినేషన్స్ నుంచి సేవ్ అయితే నేరుగా ఫినాలేకి వెళ్తారని చెప్పారు బిగ్ బాస్.

తర్వాత అభిజిత్-హారిక మధ్య డిస్కషన్ జరిగింది. ఏమైందో చెప్పు అభిజిత్.. నువ్ చెప్తేనే కదా నాకు అర్థమౌతుంది అని హారిక అడగ్గా నీకు తెలవంది ఏం కాదులే.. నేను నీ ఫ్రెండ్‌గా చెప్తున్నా.. కొన్ని కొన్ని విషయాలను అర్థం చేసుకుని నీ ప్రాబ్లమ్ ఇదీ అని చెప్తావని చూస్తా.. కానీ నువ్ స్టాండ్ తీసుకోవు అని బాధపడ్డాడు అభి. అయితే వీరిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుండగా అఖిల్ వచ్చి చాలా థాంక్స్ అభిజిత్.. నువ్ లేకపోతే టాస్క్ అంత వరకూ వచ్చేది కాదు అంటూ హగ్ చేసుకున్నాడు.

తర్వాత డేర్ టు టాస్క్‌లో అభిజిత్ తన గర్ల్ ఫ్రెండ్ లిస్ట్ బయటపెట్టాడు. అవినాష్ అయితే ఇంటి సభ్యులు ఒక్కొక్కరిగురించి అద్భుతంగా బుర్ర కథ రూపంలో చెప్తూ తన టాలెంట్‌ని బయటపెట్టాడు. తర్వాత ఇప్పటివరకూ మీ పర్ఫామెన్స్‌ని పరిగణలోకి తీసుకుని ఈ ఇంట్లో ఏ ర్యాంక్‌కి సరిపోతారని అనుకుంటున్నారో చెప్పాలని కోరగా ర్యాంక్ 6 మీద నిలబడిన సభ్యుడు వరస్ట్ పెర్ఫామర్ ఆఫ్ ది సీజన్‌గా పరిగణించబడతారని చెప్పారు బిగ్ బాస్.

బజర్ మోగగానే సొహైల్ నెంబర్ 1 స్థానంలో నిలబడగా.. అరియానా నెంబర్ 2, హారిక నెంబర్ 3, మోనాల్ నెంబర్ 4 స్థానాల్లో నిలబడ్డారు. అయితే మైండ్ గేమర్‌గా పేరొందిన అభిజిత్ చివరి స్థానంలో 6లో నిలబడ్డాడు. వరస్ట్ పెర్ఫామర్ ఆఫ్ ది సీజన్‌గా అభిని పరిగణిస్తూ తక్షణమే అభిజిత్‌ని జైలులోకి వెళ్లాలని ఆదేశించారు బిగ్ బాస్. దీంతో బోరు బోరున ఏడ్చింది హారిక.