చెత్త పడేసిన యువకుడిని నిలదీసిన అనుష్క.. వీడియో

446
- Advertisement -

విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ.. బెస్ట్‌ సెలబ్రిటీ కపుల్స్‌ వీరు ఒకరు. ఈ జంటని ముద్దుగా విరుష్క అని కూడా పిలుస్తుంటారు. గతేడాదే వీరిద్దరూ ప్రపంచంలోనే అ‍త్యంత ఖరీదైన హాలిడే స్పాట్‌ పెళ్లి చేసుకున్నారు. అనుష్క కష్టపడే తత్వం, నిజాయితీ, దేనినైనా నిర్భయంగా చెప్పే గుణం అంటే తనకు ఎంతో ఇష్టమని విరాట్‌ చాలా సార్లే చెప్పారు. ఎ‍ప్పడికప్పుడు అనుష్క శర్మపై తనకున్న ప్రేమను ట్విటర్‌లో చాటిచెబుతూనే ఉన్నారు. తాజాగా తన భార్య కోపంతో రగిలిపోయే ఓ వీడియోను విరాట్‌ కోహ్లి షేర్‌ చేశారు.

Anushka Sharma

మరి అనుష్కకు కోపం ఎందుకోచ్చిందనేగా మీ సందేహం..ముంబయిలో రోడ్డుపై ఖరీదైన కారులో వెళుతూ ఓ యువకుడు చెత్తను నడి రోడ్డుపైనే పడేశాడు. ఆ సమయంలో అదే కారు పక్కనుంచి మరో కారులో వెళుతోన్న బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ ఈ విషయాన్ని గుర్తించి వెంటనే కారులోంచే ఆ యువకుడిని ప్రశ్నించింది. ఇలా ఎందుకు చెత్త రోడ్డుపై పడేశారు? అంటూ నిలదీసింది. దయచేసి చెత్తబుట్టను వాడండని క్లాస్‌ ఇచ్చింది.

ఈ ఘటన చోటు చేసుకుంటుండగా వీడియో తీసిన ఆమె భర్త, క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేశాడు. రోడ్డుపై చెత్త పడేసే వారు కనిపిస్తే వారిని ప్రశ్నించండని అన్నాడు. వీరా దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేది? అని కారులోంచి చెత్త పడేసిన వారిని విమర్శించాడు. ఎవరైనా చెత్త పడేయడం చూసినప్పుడు మీరూ ఇలానే చేయండని సూచించాడు.

- Advertisement -