సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్-2018 విజేతలు వీరే..

303
65th Jio Filmfare Awards (South) 2018
- Advertisement -

చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన నటీ నటులకు అవార్డులను ఇస్తూ , వారికి ప్రోత్సహం అందించే ఫిలిం ఫేర్ అవార్డుల కార్యక్రమం 65వ సంవ‌త్స‌రానికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. 65వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కార్యక్రమం నిన్న రాత్రి హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో వైభవంగా జరుగగా, తెలుగు, త‌మిళ‌, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగులో ‘బాహుబ‌లి-2’ చిత్రం 8 అవార్డులను కొల్లగొట్టగా, అర్జున్‌ రెడ్డి చిత్రానికిగాను ఉత్త‌మ నటుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ ఎంపికయ్యారు. నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణకి లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ఇచ్చి సత్కరించారు.

ప‌లు భాష‌ల‌కి సంబంధించిన అవార్డులు వివ‌రాలు .. తెలుగులో ఉత్తమ చిత్రంగా బాహుబలి 2 నిలువగా, ఉత్తమ దర్శకుడిగా అదే చిత్రానికి రాజమౌళి అవార్డును అందుకున్నారు. ఉత్తమ నటుడిగా విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి), ఉత్తమ నటిగా సాయి పల్లవి (ఫిదా), ఉత్తమ నటుడు (క్రిటిక్స్ చాయిస్)గా వెంకటేష్ (గురు), ఉత్తమ నటి (క్రిటిక్స్ చాయిస్)గా రితికా సింగ్ (గురు), ఉత్తమ సహాయ నటిగా రమ్యకృష్ణ (బాహుబలి 2), ఉత్తమ సహాయ నటుడిగా రానా దగ్గుబాటి (బాహుబలి 2), ఉత్తమ నటి (తొలి పరిచయం)గా కల్యాణ్ ప్రియదర్శన్ (హలో) అవార్డులు పొందారు.

65th Jio Filmfare Awards (South) 2018

ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ కుమార్ (బాహుబలి 2), ఉత్తమ కొరియోగ్రాఫర్ గా శేఖర్ మాస్టర్ (ఫిదా), ఉత్తమ గేయ రచయితగా ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2 – దండాలయ్యా పాటకు), ఉత్తమ నేపథ్య గాయకుడిగా హేమ చంద్ర (ఫిదా – ఊసుపోదు సాంగ్), ఉత్తమ నేపథ్య గాయనిగా మధు ప్రియ (ఫిదా – వచ్చిండే సాంగ్), ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2), ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ గా సాబు సిరిల్ (బాహుబలి 2) అవార్డులు అందుకున్నారు.

ఇక తమిళంలో ఉత్తమ చిత్రంగా అరమ్, ఉత్తమ దర్శకుడిగా పుష్కర్ గాయత్రి (విక్రమ్ వేద), ఉత్తమ నటుడిగా విజయ్ సేతుపతి (విక్రమ్ వేద), ఉత్తమ నటిగా నయనతార (అరమ్), ఉత్తమ నటుడు (క్రిటిక్స్ చాయిస్)గా మాధవన్ (విక్రమ్ వేద), కార్తీ (థీరమ్ అడిగరం ఒంద్రు), ఉత్తమ నటి (క్రిటిక్స్ చాయిస్) అదితి బాలన్ (ఆరువి), ఉత్తమ గేయ రచయితగా వైరముత్తు (కాట్రు వెలియిదయ్ వాన్) అవార్డులు తీసుకున్నారు. వీరితో పాటు ఉత్తమ సహాయ నటిగా నిత్యా మీనన్, ఉత్తమ సహాయ నటుడిగా ప్రసన్న, ఉత్తమ నేపథ్య గాయకుడిగా అనిరుధ్ రవిచందర్, ఉత్తమ నేపథ్య గాయనిగా శశా తిరుపతి, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహ్మాన్ (మెర్సల్), ఉత్తమ తొలి చిత్ర నటుడిగా వసంత్ రవి (తారామణి) అవార్డులు తీసుకున్నారు.

65th Jio Filmfare Awards (South) 2018

మలయాళంలో ఉత్తమ చిత్రంగా తొండిముథలుమ్ దృక్సాక్షియుమ్ ఎంపికకాగా, ఉత్తమ దర్శకుడిగా దిలీష్ పోతెన్ , ఉత్తమ నటుడిగా ఫహద్ ఫజిల్, ఉత్తమ నటిగా పార్వతి (టేక్ ఆఫ్) ఉత్తమ సహాయ నటిగా శాంతి కృష్ణ, ఉత్తమ సహాయ నటుడిగా అలెన్సియెర్, ఉత్తమ గేయ రచయితగా అన్వర్ అలీ (మిజియి నిన్ను మిజియిలెక్కు), ఉత్తమ నేపథ్య గాయకుడిగా షాబాజ్ అమన్, ఉత్తమ నేపథ్య గాయనిగా కేఎస్ చిత్ర, ఉత్తమ సంగీత దర్శకుడిగా రెక్స్ విజయన్ (మాయనది), ఉత్తమ తొలిచిత్ర నటుడిగా ఆంటోనీ వర్గీస్ (అంగామలి డైరీస్), ఉత్తమ తొలిచిత్ర నటిగా ఐశ్వర్య లక్ష్మి అవార్డులు తీసుకున్నారు.

కన్నడలో ఉత్తమ చిత్రంగా ఒందు మొట్టెయ కథె, ఉత్తమ దర్శకుడిగా తరుణ్ సుధీర్ (చౌక), ఉత్తమ నటుడిగా రాజ్ కుమార, ఉత్తమ నటిగా శ్రుతి హరిహరన్, ఉత్తమ గేయ రచయితగా వి నాగేంద్ర ప్రసాద్ (అప్పా ఐ లవ్యూ – చౌక), ఉత్తమ సహాయ నటిగా భవానీ ప్రకాశ్, ఉత్తమ సహాయ నటుడిగా పి రవిశంకర్ ఉత్తమ నేపథ్య గాయకుడిగా అర్మాన్ మాలిక్, ఉత్తమ నేపథ్య గాయనిగా అనురాధ భట్, ఉత్తమ సంగీత దర్శకుడిగా బీజే భరత్ అవార్డులు అందుకున్నారు.

- Advertisement -