అమెరికాలో నాకొక కల ఉంది అన్న జూ.మార్టిన్ లూథర్ కింగ్ స్పీచ్ నేటి అమెరికా యువత మర్చిపోతున్నారు. బారాక్ ఒబమా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కూడా తెల్ల జాతీయులు నల్ల జాతీయులపై దాడులను ఆపలేకపోయాడు. దానికి కారణం తెల్ల జాతీయుల నరనరాన జాతి అహంకారం ఉండటమే. తాజాగా పోలీసుల దౌర్జన్యాలకు నల్లజాతి యువకుడు బలైయ్యారు.
Someone clipped a longer version of the #TyreNichols clip I had made
Tyre Nichols was indeed beaten like Rodney King, but this in this case, it was to his death
#TyreNicholsVideo #Memphis #Protest pic.twitter.com/EaiBY2hm9J— Red Redact 🇺🇸🇨🇦 (@TheRedOperation) January 28, 2023
ఈ నెల 7న రాత్రి మెంఫిన్ నగరంలో టయిర్ నికోలస్ అనే 29యేళ్ల నల్లజాతీయుడ్ని ఐదుగురు పోలీసులు నడిరోడ్డుపై దారుణంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక అమ్మా అమ్మా అమ్మా… అని అరుస్తున్నా విచక్షణారహితంగా కొట్టి వెళ్లిపోయారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 10న ప్రాణాలు కోల్పోయాడు. యువకుడిపై పోలీసులు దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి రావడంతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి.
I don’t think I can consume much more of the #TyreNichols video.
Hearing him scream “MOM” sent chills down my spine.
I am praying for his mother, loved ones and the city of #Memphis. 🙏🏽
⚠️WARNING: GRAPHIC VIDEO ⚠️ pic.twitter.com/Orkd7fLkWb
— Bria Jones WREG (@BriaJonesTV) January 28, 2023
ఇష్టమొచ్చినట్టు కొట్టి అతడిని రోడ్డు మీదే వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ రోడ్డుపై స్తంభానికి ఉన్న రిమోట్ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిలో యువకుడ్ని కొట్టిన 23 నిమిషాల తర్వాత అంబులెన్స్ వచ్చినట్టు రికార్డు అయింది. దాంతో పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలంటూ అమెరికాలోని పలు నగరాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి…