యుద్ధం వస్తే భారత్ పరిస్థితేంటి..?

372
us vs iran
- Advertisement -

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుతుకున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా ప్రకటనల యుద్ధం కొనసాగుతోంది. మాతో పెట్టుకుంటే తట్టుకోలేవని ఇరాన్‌ను అమెరికా హెచ్చరిస్తే… మేమెవరికీ భయపడేది లేదని ఇరాన్ ఎదురు హెచ్చరికలు చేస్తోంది.

అయితే అసలు అమెరికా- ఇరాన్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడానికి గల అసలు కారణాలను పరిశీలిస్తే….ట్రంప్ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి పశ్చిమాసియాపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉంచారు. ఎందుకంటే ట్రంప్‌ కుటుంబానికి సౌదీ యువరాజుకు మధ్య దగ్గర సంబంధాలున్నాయి. దానితో సౌదీ చమురు పరిశ్రమ అభివృద్ధి కోసం ఇరాన్‌ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై ఆంక్షలు విధించింది అమెరికా. అందుకే అటు అమెరికాను కాదనలేక, ఇటు ఇరాన్‌ను దారికి తీసుకురాలేక పశ్చిమాసియా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి.

ఇక ఇరాన్‌తో అమెరికా యుద్ధం చేస్తే పరిస్ధితి ఏంటనే దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చనడుస్తోంది. భారత్‌కు యుద్ధంతో నష్టమా..?త్వరలోనే లీటర్ పెట్రోల్ వంద రూపాయలకు చేరడం ఖాయమా ? అనే వార్తలు వెలువడుతున్నాయి.

వాస్తవానికి సౌదీ అరేబియా, ఇరాక్‌ తరవాత భారత్‌కు భారీగా చమురు ఎగుమతి చేసే దేశం ఇరానే. ఇరాన్‌తో వ్యాపారం వల్ల భారత్‌కు అనేక లాభాలున్నాయి. ఇరాన్‌ సరఫరా చేసే చమురు చౌకగా అందడంతో పాటు ఎక్కువ కాలం అరువు ఇస్తారు. భారత్‌ ఎక్కువ భాగం యూరోలలో ఇరాన్‌కు డబ్బు చెల్లిస్తుంది. మిగతాది రూపాయలలో చెల్లిస్తుంది. అంటే అమెరికా డాలర్‌ మీద ఆధార పడవలసిన అవసరం లేదు. 2018-19లో 100 బిలియన్‌ డాలర్లు వెచ్చించాం. అంటే ఇదీ 70 వేల కోట్ల రూపాయలతో సమానం.

మన దేశానికి రోజూ ఇరాన్‌ నుంచి దిగుమతి అయ్యే చమురులో సగానికి సగం తగ్గించుకున్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. చమురు దిగుమతులు క్రమంగా తగ్గుతూ ఉంటే.. దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై పడుతుంది. అప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరుగుతాయి. జనం నెత్తిన పెట్రో బాంబు పేలే ప్రమాదమూ కనిపిస్తోంది.

- Advertisement -