సిరియాపై అమెరికా మెరుపు దాడి…

275
- Advertisement -

సిరియాలో మరోసారి యుద్ధవాతావరణం నెలకొంది. ఇటీవల జరిగిన రసాయన దాడుల్లో వందల మంది చిన్నారులు చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అమెరికా దళాలు వైమానిక దాడులకు దిగాయి. తూర్పు డమాస్కస్‌ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున దట్టమైన పొగలు వెలువడుతున్నాయని, పేలుళ్ల ధాటికి ఆ ప్రాంతంతో ఆకాశం నారింజ రంగులో కన్పిస్తోందని ఓ మీడియా సంస్థ వెల్లడించింది.

అసద్‌ రసాయన ఆయుధాలను వాడినందుకు శిక్షగా, మరోసారి రసాయన ఆయుధాలు వాడకుండా ఆపేందుకు సిరియాపై వైమానిక దాడులు చేస్తున్నామని ట్రంప్‌ శుక్రవారం రాత్రి ప్రకటించారు. అయితే సిరియా మాత్రం నిషేధిత ఆయుధాలను తాము వాడలేదని చెప్తోంది.

ఈ ఏడాదిలో ట్రంప్‌ సిరియాపై రసాయన దాడులు చేయించడం ఇది రెండోసారి.రసాయన దాడులతో ప్రజల ప్రాణాలు తీస్తున్న అసద్‌కు సహాయం చేయడం తగదని ట్రంప్‌ రష్యాకు చీవాట్లు పెట్టారు. డమాస్కస్‌లో బాధ్యతాయుతమైన పాలన తీసుకొచ్చేందుకు తమతో కలిసి రావాలని కోరారు.

 US Strike Syria Over Suspected Chemical Weapons Attack

సిరియాలో గత వారం రసాయన దాడి జరిగిందనడానికి ఇప్పటివరకు సాక్ష్యాధారాల్లేవని అమెరికా రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌ పునరుద్ఘాటించారు. అయితే, అక్కడ రసాయన దాడి జరిగిందన్నది తన వ్యక్తిగత నమ్మకమని చెప్పారు. సిరియా అధ్యక్షుడు బషర్‌ అసద్‌కు వ్యతిరేకంగా అమెరికాతో పాటు ఫ్రాన్స్‌, యూకే దళాలు కూడా చేతులు కలిపి సైనిక దాడులు చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం సిరియాలో జరిగిన రసాయన దాడులపై ఆగ్రహంతో, దానికి ప్రతీకార చర్యగా అమెరికా ఈ దాడులు చేస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి ఈ దాడులు జరుగుతున్నాయి.

- Advertisement -