సమంత ‘యూ టర్న్’లో భూమిక..

424
Bhumika Chawla joins Samantha’s ‘U-Turn’ remake
- Advertisement -

సమంత-ఆది పినిశెట్టి వీరిద్దరు కలిసి నటించిన తాజా చిత్రం రంగస్థలం. ఈ సినిమాలో రామలక్ష్మీగా సమంత, రాంచరణ్‌ అన్న కుమార్‌బాబుగా ఆది పినిశెట్టి మంచి మార్కులే కొట్టేశారు. ప్రస్తుతం ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది. అయితే సమంత-ఆదిపినిశేట్టి కలయికతో వస్తున్న తాజా చిత్రం ‘యూటర్న్’ కాగా ఈ చిత్రంలో సీనియర్ నటీ భూమిక నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ పాల్గొన్నది భూమిక.

Bhumika Chawla joins Samantha’s ‘U-Turn’ remake

పెళ్లి గ్యాప్ తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెడుతూ ఆమె నటించిన చిత్రం ‘ఎంసీఎ’ ఈ సినిమాలో నానికి వదినగా నటించారు భూమిక. చాలా రోజల తర్వాత నటించిన ఆమె ఈ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నారు. సమంత నటిస్తున్న ‘యూ టర్న్’ చిత్రంలో భూమిక దెయ్యం పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.

ఈ చిత్రం షూటింగ్ సమయంలో తీసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాల్లో వైరల్ గా మారింది. కన్నడంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తూ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిత్తూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కన్నడలో డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ తెలుగులో కూడా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ బాషల్లో రూపోందుతుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైంది.

- Advertisement -