ఫిబ్ర‌వ‌రి 12న ఉప్పెన‌

157
uppena
- Advertisement -

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం ఉప్పెన‌. కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ మూవీని విడుద‌ల తేది ఖారార‌య్యింది. ఫిబ్ర‌వ‌రి 12న ఈ సినిమాని థియేట‌ర్‌ల‌లో విడుద‌ల‌చేయ‌నున్నారు మేక‌ర్స్‌.

ఇప్పటికే సంగీతంలో త‌న‌ అభిరుచికి, పాట‌ల‌ను ప్రెజెంట్ చేసిన విధానంతో అంద‌రి దృష్టినీ త‌న‌వైపుకు తిప్పుకున్న బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతోపాటు క‌థ‌, స్క్రీన్‌ప్లే, సంభాష‌ణ‌ల‌ను కూడా అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇటీవ‌ల రిలీజైన ఈ సినిమా టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ ల‌భించింది. వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి వారి స్క్రీన్ ప్ర‌జెన్స్‌తో ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకున్నారు. ఈ టీజ‌ర్‌తో ‘ఉప్పెన‌’పై అంచ‌నాలు భారీగా పెరిగాయి.దేవి శ్రీప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూర్చ‌గా ఇప్ప‌టికే విడుద‌లైన అన్ని పాట‌లు శ్రోత‌ల‌‌ను అల‌రిస్తున్నాయి. త‌మిళ స్టార్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

తారాగ‌ణం:
పంజా వైష్ణ‌వ్ తేజ్‌, విజ‌య్ సేతుప‌తి, కృతి శెట్టి, సాయిచంద్‌, బ్ర‌హ్మాజీ

సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: బుచ్చిబాబు సానా
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్‌
బ్యాన‌ర్స్‌: మైత్రి మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌
సీఈవో: చెర్రీ
మ్యూజిక్‌: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: షామ్‌ద‌త్ సైనుద్దీన్‌
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
ఆర్ట్‌: మౌనిక రామ‌కృష్ణ‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: అనిల్ వై, అశోక్ బి.
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌, మ‌ధు మ‌డూరి.

- Advertisement -