రైతులను జైల్లో పెట్టాలి : కంగనా

33
Kangana Ranaut

రిపబ్లిక్ డే సందర్భంగా దేశరాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వందల సంఖ్యలో రైతులతో పాటు పోలీసులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో స్పందించిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ …రైతుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది.

గణతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోటపై ఎలా దాడి జరిగిందో చూశాం. అక్కడ నిరసనకారులు ఖలిస్థాన్ జెండాను ఎగురవేశారు…ఎర్రకోట నుంచి అందుతున్న వార్తలు చాలా నిరాశను, కోపాన్ని తెప్పిస్తున్నాయని తెలిపింది. దునియాలో మనకు పరువు లేకుండా చేసేశారు. ఇతర దేశాల ప్రధానులు వస్తే మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితికి ఇండియాను తీసుకొచ్చారని తెలిపిన కంగనా…. రైతుల ఆందోళనలకు మద్దతు తెలుపుతున్న వారందరినీ జైళ్లలో వేయాలని కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసింది.