పోలీసుల పనితీరు భేష్: అనుష్క

33
anushka shetty

కొవిడ్‌ సమయంలో పోలీసులు చాలా బాగా పనిచేశారని కితాబిచ్చారు సినీ నటి అనుష్క. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో షి షాహి కార్యక్రమం జరుగగా మహిళా భద్రతా అదనపు డీజీ స్వాతిలక్రా, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, షీ టీమ్స్‌ డీసీపీ అనసూయతో కలిసి సైబరాబాద్‌ డయల్‌ 100 క్విక్‌ రెస్పాన్స్‌ వాహనాలను అనుష్క ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన అనుష్క….ప్రతి మహిళా పోలీస్ ఒక స్టార్ అని కొనియాడారు. తెలంగాణలో ఇంతమంది మహిళా పోలీసులు ఉండటం సంతోషకరమని చెప్పారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.

మగవారికి పోటీగా మహిళా పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. సైబరాబాద్‌లో 12 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నారని … ట్రాఫిక్‌, సైబర్‌ క్రైం సహా అన్ని విభాగాల్లో మహిళలు ఉన్నారని వెల్లడించారు. షీ టీంతో సమాజంలో తప్పక మార్పు వస్తుందన్నారు. సమాజం, దేశం కోసం స్త్రీ శక్తి సన్నద్ధం కావాలన్నారు.