నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని హాలియా పట్టణంలోని, మిర్యాలగూడ రోడ్, చైతన్య ఫంక్షన్ హాల్లో జరిగిన “ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం” కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొని, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లేటి దామోదర్ గుప్త, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ అమరవాది లక్ష్మీ నారాయణ, తెలంగాణ రాష్ట్ర హస్త కళల చైర్మన్ బొల్లం సంపత్ మరియు గుడాల భాస్కర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాల కాలంలో ఆర్యవైశ్యులను గుర్తించి, వారికి గౌరవం దక్కించింది సీఎం కేసీఆర్ మాత్రమే కాబట్టి మనందరం,వారికి ఋణపడి ఉండాలి. 73 సంవత్సరాల చరిత్రలో జరగని న్యాయం ఆర్యవైశ్యులకు ఈ 7 సంవత్సరాల కాలంలో జరిగింది అని అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఆర్యవైశ్యులను వాడుకున్నాయి తప్ప ఏ ఒక్క పని చేయలేదు. ఆర్యవైశ్యులు అంటే సీఎం కేసీఆర్‌కు అపారమైన నమ్మకం ఉందని, కేసీఆర్ మాట ఇస్తే తప్పరు.. ఆర్యవైశ్య కార్పొరేషన్ కూడా చేస్తా అన్నారు కచ్చితంగా ఏర్పాటు చేస్తారని నమ్మకం ఉందన్నారు. ఆర్యవైశ్యుల అందరికీ అండగా ఉంటామని.. మేము హైదరాబాద్‌లో ఉన్నా నియోజకవర్గ పరిధిలోని వారికి మా సహకారం అందిస్తామని.. ఎల్ల వేళలా అందుబాటులో ఉంటామని అన్నారు.
ఆర్యవైశ్య పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ళు, రేషన్ కార్డులు ఇప్పిస్తానని అన్నారు. ఇప్పటికే 24 గంటల కరెంటుతో వ్యాపారం చేయడంలో తోడ్పడుతున్నాము,కల్యాణ లక్ష్మి పథకం అందిస్తున్నాము. తమ్ముడు నోముల భగత్‌ను ఆర్యవైశ్యులు అందరూ ఆశీర్వదించి, ఐక్యమత్యంతోని కలిసి పని చేసి ఈ నెల 17న జరిగే ఉప ఎన్నికల్లో ఆర్యవైశ్యులు అందరూ కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని ఉప్పల శ్రీనివాస్ గుప్త కోరారు. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించి గిఫ్ట్‌గా ఇవ్వాలని పిలుపునిచ్చారు.