మనవసేవే మాధవ సేవ స్ఫూర్తితో వైద్య సేవలు అభినందనీయం..

179
Vanajeevi Ramaiah

మానవ సేవే మాధవ సేవగా భావించడమే కాకుండా, అక్షరాలా ఆ స్ఫూర్తిని ఆచరణలో పెడుతూ వైద్య సేవలు అందించడం జాగృత్ ఆసుపత్రుల డాక్టర్లు కేస గాని రాజశేఖర్ గౌడ్, రేపాక నిఖిల్ లు పూనుకోవడం అభినందనీయమనీ పద్మశ్రీ వనజీవి రామయ్య, అన్నం ఫౌండేషన్ స్థాపకులు అన్నం శ్రీనివాసరావు అభినందనలు ప్రకటించారు.

ఆదివారం జాగృత్ న్యూరో హాస్పిటల్ ను వనజీవి రామయ్య, అన్నం శ్రీనివాసరావులు ప్రారంభించి, మాట్లాడారు. దైవం మానేశా రూపం అన్నదానికి ప్రతిరూపంగా ఇరువురు డాక్టర్లు వైద్య సేవలు ఉత్తమ రీతిలో అందజేయడం ఈ రోజుల్లో ఎంతో కష్టంతో కూడుకున్న పని అని అన్నారు. కరోనా కాలంలో అయినవారు కానివారుగా మారిన ఈ నేపథ్యంలో డాక్టర్లు తమ ప్రాణాలకు తెగించి ఇతరుల ప్రాణాలు కాపాడటానికి సేవలు చేయడం వారి సేవాతత్పరతకు నిదర్శనమన్నారు.

డాక్టర్లు రాజశేఖర్ గౌడ్, నిఖిల్ మాట్లాడుతూ.. తమ తల్లిదండ్రుల స్ఫూర్తితో ఈ విధమైన సేవలకు శ్రీకారం చుట్టనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు నందగిరి శ్రీనివాస రావు ఆర్ వి ఎస్ సాగర్ మాట్లాడుతూ.. డాక్టర్ రాజశేఖర్ గౌడ్, డాక్టర్ రేపాక నిఖిల్ సేవా దృక్పథంతో వైద్య సేవలు అందజేయడం సంతోషకరమన్నారు.

ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి ఈరోజు 2000 మొక్కలను పంపిణీ చేయడం డాక్టర్ కేసగానీ రాజశేఖర్ గౌడ్, డాక్టర్ రేపాక నిఖిల్ ల సామాజిక స్పృహకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్‌. గోపాలకృష్ణ మూర్తి,బత్తిని వీరయ్య, డాక్టర్ సృజన, కే. కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.