జమ్మి మొక్కల పంపిణీ చేసిన TSTDC చైర్మన్ శ్రీనివాస్ గుప్త..

25

ఎంపీ,రాజ్యసభసభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా..ఊరి ఊరికో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా.. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆధ్వర్యంలో.. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ -తెలంగాణ ఆధ్వర్యంలో..జమ్మి చెట్టు మొక్కల పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం జమ్మి చెట్లు దేవాలయాలలో నాటడం కోసం అందరికీ ఉచితంగా అందజేయడం జరిగినది. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో.. ఉప్పల శ్రీనివాస్ నివాసం దగ్గర 200 జమ్మి చెట్టు మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం..వాత్సల్య ఫౌండేషన్ అనాథ పిల్లలతో కలిసి జైపురి కాలనీలో శ్రీ సాయి బాబా దేవాలయం ఆవరణలో నాలుగు 4 జమ్మి చెట్టు మొక్కలు నాటారు శ్రీనివాస్ గుప్త.

ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. మానవ మనుగడకు మొక్కలే ప్రాణం హరిత తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారు. వాతవారణ సమత్యులను కాపాడేందుకు ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రతి ఊరికి జమ్మిచెట్టు, ప్రతి గుడికి జమ్మిచెట్టు నాటాలని రాజ్యసభ సభ్యులు జోగునపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపుతో జమ్మి మొక్కను నాటామన్నారు. ఈ సందర్భంగా జమ్మి చెట్టు ప్రాధాన్యతను తెలుపుతూ రాష్ట్ర వృక్షం జమ్మి. ఈ వృక్షాన్ని ప్రపంచ అద్భుతంగా వృక్షంగా చెప్పుకోవచ్చు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ జమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా ప్రకటించారు. తెలంగాణ కు హరితహారం కార్యక్రమంతో తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచుతున్నారు. ప్రపంచ పర్యావరణ ఉద్యమంలో గ్రీనరి పెంచడంలో మనం భాగస్వాములం అవుదాం. మొక్కలు నాటుదాం. మన పిల్లలకు నివాసయోగ్యమైన భూగోళాన్ని వారసత్వంగా అప్పగిద్దామని అన్నారు. రెండు జంట నగరాలలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో..1100 దేవాలయాల్లో 1100 జమ్మి చెట్టు మొక్కలు నాటాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో.. IVF స్టేట్ సెక్రటరీ పబ్బ చంద్ర శేఖర్,IVF జనరల్ సెక్రటరీ విశ్వేశ్వర రావు, Ivf స్టేట్ కో ఆర్డినేటర్ కూర నాగరాజు,గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ ఊట్కూరి శ్రీనివాస్ గుప్తా సికింద్రాబాద్ ప్రెసిడెంట్ కటకం శ్రీనివాస్, పొలిటికల్ కమిటీ చైర్మన్ బచ్చు శ్రీనివాస్, IVF స్టేట్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చందా భాగ్య లక్ష్మి, IVF ప్రథమ మహిళ ఉప్పల స్వప్న, Ivf మహిళా విభాగం హైదరాబాద్ అధ్యక్షురాలు విశ్వజ్యోతి, మరియు వాత్సల్య ఫౌండేషన్ అనాథ పిల్లలు.., కాలనీ వాసులు మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ -తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు రెండు జంట నగరాల అన్ని విభాగాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.