ముఖ్యమంత్రుల భేటీలో పాల్గొన్న సీఎం కేసీఆర్..

49

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి, ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రులు, హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చించారు. ఈ భేటీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి హాజరైయ్యారు. ఈ సమావేశంలో గత నాలుగు సంవత్సరాల కాలంలో నక్సల్స్ ప్రభావం తగ్గిందన్న విషయాన్ని ముఖ్యమంత్రులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు హోంశాఖ అధికారులు.

అలాగే ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితులుపై హోం శాఖ మంత్రితో ముఖ్యమంత్రులు చర్చించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో రాష్ట్రాలు చేస్తున్న అభివృద్ధిని హోం శాఖ మంత్రికి వివరించారు. నక్సలిజంలోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేయాలంటే అభివృద్ధే ప్రధాన ఎజెండా అన్నారు ముఖ్యమంత్రులు. మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఆపరేషన్లపై భేటిలో చర్చించారు. అలాగే భద్రతాపరమైన లోపాలను సరిదిద్దడం, మావోయిస్టు అనుబంధ సంస్థలపై చర్యలపై చర్చ.సాగింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలు కల్పన.. నక్సల్స్ ఎక్కువగా ఉన్న ప్రభావిత ప్రాంతాలలో టెలికాం సెక్టర్ సంబంధించిన పనులను వేగవంతం చేయాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సూచించారు.