ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. స్పెషల్ సమ్మరీ రివిజన్ (SSR)లో భాగంగా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో కొత్తగా 18.84 లక్షల మందికి పైగా ఓటర్లు చేరారు. దీంతో రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 13.58 కోట్లకు చేరుకుంది. 2026 నవంబర్ 17, మంగళవారం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
స్పెషల్ సమ్మరీ రివిజన్ (SSR) ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం మొత్తం 13,58,68,905 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 7,38,58,510 మంది పురుష ఓటర్లు కాగా, 6,20,06,353 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అంతేకాకుండా 18 నుంచి 19 ఏళ్ల వయసు కలిగిన 11,83,523 మంది యువ ఓటర్లు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
గతంలో ఏప్రిల్ 10న ప్రచురించిన ఓటర్ల జాబితా ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 13,39,84,792 మంది ఓటర్లు ఉన్నారు. తాజాగా విడుదల చేసిన ముసాయిదా జాబితాలో ఈ సంఖ్య 13,58,68,905కు పెరిగింది. అంటే కొత్తగా 18,84,113 మంది ఓటర్లు జాబితాలో చేరినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Also Read:ఆ పాదయాత్ర ఓ గొప్ప జ్ఞాపకం..కేటీఆర్!
తాజా ఓటర్ల జాబితాతో ఉత్తరప్రదేశ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 13.58 కోట్ల మార్కును దాటింది. ముఖ్యంగా యువ ఓటర్ల నమోదు కూడా గణనీయంగా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

