నదిలో కొట్టుకుపోతున్న కుక్క..కాపాడిన మంత్రి!

6
- Advertisement -

మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించే ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. ఛత్ పూజ వేడుకల సందర్భంగా హుగ్లీ నదిలో బలమైన ప్రవాహానికి కొట్టుకుపోతున్న ఓ కుక్కను కాపాడేందుకు రాష్ట్ర మంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. జంతువు ప్రాణాలను రక్షించేందుకు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ (NDRF) సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతాలోని బాబు ఘాట్ వద్ద సోమవారం ఉదయం ఛత్ పూజ ఏర్పాట్లను పరిశీలించేందుకు పశ్చిమ బెంగాల్ క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఇంద్రనీల్ ఖాన్ వెళ్లారు. ఆ సమయంలో గంగా నదిలో బలమైన నీటి ప్రవాహానికి ఓ కుక్క కొట్టుకుపోతూ కనిపించింది. నీటిలో మునిగిపోకుండా ఉండేందుకు ఆ కుక్క తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ క్రమంగా శక్తిని కోల్పోతోంది.

దీన్ని గమనించిన మంత్రి వెంటనే స్పందించారు. ఘాట్ వద్ద విధుల్లో ఉన్న జాతీయ విపత్తు స్పందన దళం (NDRF), విపత్తు నిర్వహణ బృందం (DMG) సిబ్బందిని అప్రమత్తం చేసి తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Also Read:ఆ పాదయాత్ర ఓ గొప్ప జ్ఞాపకం..కేటీఆర్!

మంత్రి సూచనలతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మూడు స్పీడ్ బోట్లతో నదిలోకి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు నీటిలో కొట్టుకుపోతున్న కుక్కను సురక్షితంగా రక్షించారు. అనంతరం దానిని కోల్‌కతా రివర్ ట్రాఫిక్ పోలీసుల జెట్టీ వద్దకు తీసుకొచ్చారు. కుక్కను బయటకు తీసుకొచ్చిన తర్వాత చలితో వణికిపోతుండటాన్ని గమనించిన మంత్రి.. సమీపంలోని కుర్చీపై ఉన్న తెల్లటి టవల్ తీసుకొచ్చి దానికి కప్పారు. అంతేకాకుండా దాని కోసం వెచ్చని పాలను కూడా ఏర్పాటు చేశారు. కుక్క కోలుకునే వరకు మంత్రి అక్కడే ఉండటం పలువురిని ఆకట్టుకుంది.

 

 

View this post on Instagram

 

A post shared by ThePrint (@theprintindia)

- Advertisement -