ఆ పాదయాత్ర ఓ గొప్ప జ్ఞాపకం..కేటీఆర్!

1
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా 15 ఏళ్ల క్రితం నిర్వహించిన పాదయాత్రను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. ఉద్యమ దళపతి కేసీఆర్ పిలుపు మేరకు 2011 నవంబర్ 16 నుంచి 21వ తేదీ వరకు సాగిన ఈ పాదయాత్ర తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక గొప్ప జ్ఞాపకంగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.

వికారాబాద్ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర నవాబ్‌పేట్, శంకర్‌పల్లి, పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, బాలానగర్ సర్కిల్ మీదుగా కుత్బుల్లాపూర్ వరకు కొనసాగిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఆరు రోజుల పాటు సాగిన ఈ యాత్రకు తెలంగాణ సమాజంలోని సబ్బండ వర్గాల నుంచి విశేష మద్దతు లభించిందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా సాగిన ఉద్యమంలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు, ఉద్యమ స్ఫూర్తి, తెలంగాణ సాధించాలన్న పట్టుదల ఈ పాదయాత్రలో స్పష్టంగా కనిపించాయని గుర్తుచేశారు.

Also Read:ఫిలిప్పీన్స్‌లో ప్రధాని మోదీ పర్యటన

15 ఏళ్లు గడిచినా ఆ పాదయాత్ర జ్ఞాపకాలు, ఉద్యమ సమయంలో ప్రజలు చూపిన ఐక్యత, పోరాట స్ఫూర్తి ఎప్పటికీ మరువలేనివని కేటీఆర్ పేర్కొన్నారు.

 

- Advertisement -