కొడుకుతో గడ్డం గీయించుకున్న కేంద్రమంత్రి..!

267
Union Minister Ram Vilas Paswan
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో అన్నీ బంద్ అయిపోయాయి.అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.. సామాన్యుడికైనా, ప్రముఖుడికైనా ఇందులో మార్పేమీ లేదు. లాక్ డౌన్ కారణంగా కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ సైతం ఇంటికే పరిమితం అయ్యారు. అయితే, సెలూన్లు మూసివేయడంతో ఆయన తన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తో హెయిర్ ట్రిమ్మింగ్ చేయించుకున్నారు.

లోక్ జనశక్తి పార్టీ నేత కూడా అయిన చిరాగ్ ఆ దృశ్యాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఇవి గడ్డు రోజులే.. కానీ ఈ చీకట్లో కొన్ని వెలుగులు కూడా ఉన్నాయి. నాకు ఈ ప్రావీణ్యం (గడ్డం గీయడం) ఉందని ఇప్పుడే తెలిసివచ్చింది అని ఆయన కామెంట్ కూడా పెట్టారు. ఈ వీడియోను గంటలోపే వెయ్యిమంది లైక్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

- Advertisement -