కరోనా.. మేజిక్‌తో ప్రజలను అవగాహన..

50
Magician

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పటిష్టమైన చర్యలు చేపడుతున్నాయి. ఇక లాక్‌డౌన్‌ నడుస్తున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు,సినీ,క్రీడాకారులు ప్రజలకు కరోనా నియంత్రణపై ఆవగాహన కల్పిస్తున్నారు. ఇంట్లోనే ఉంటు కరోనా బారిన పడకుండా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మెజీషియన్ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాడు.

Magic

ఈయన పేరు వెంకట్ రెడ్డి, గత నెల అమెరికా నుంచి వచ్చాడు. ఇతను హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం అతను హోమ్ క్వారెంటాయిన్‌లో ఉన్నాడు. అంతేకాదు ఇతను ఓ మంచి మెజీషియన్ కూడా.. ఇంట్లో నుంచి బయటకు రావద్దు అని సూచిస్తూ తను మేజిక్ చేస్తూ ప్రజలను అవగాహన పరుస్తున్నాడు.