దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..

416
corona cases
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,731కి పెరగ్గా, కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 295కి చేరింది. ఇప్పటివరకు 845 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు లక్ష 87 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని కేంద్రం ప్రకటించింది. 151 పరీక్ష కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించింది.

కరోనా నియంత్రణ కోసం ప్రైవేటు ఆసుపత్రుల సేవలను కూడా వినియోగించుకుంటున్నామని, కరోనా పరీక్షలు చేసేందుకు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎంల అభిప్రాయాల మేరకు లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పొడిగించనున్నట్లు ప్రధాని పేర్కొన్న విషయం తెలిసిందే. అన్ని రాష్ట్ర ప్రభుత్వలు ఇందుకు తగిన చర్యలు చేపట్టాయి.

రాష్ట్రాల వారీగా కరోనా కేసులు, మృతుల వివరాలు ఇవి….

మధ్యప్రదేశ్ లో 532 పాజిటివ్ కేసులు, 42 మరణాలు
గుజరాత్ లో 493 కేసులు, 23 మంది మృతి
ఉత్తరప్రదేశ్ లో 452 కేసులు, ఐదుగురి మృతి
కేరళలో 373 కేసులు, ఇద్దరి మృతి
జమ్మూకశ్మీర్ లో 224 కేసులు, 4 మరణాలు
కర్ణాటకలో 226 కేసులు, 6 మరణాలు
హర్యానాలో 179 కేసులు, ఇద్దరి మృతి
పంజాబ్ లో 158 కేసులు, 12 మంది మృతి
పశ్చిమబెంగాల్ లో 132 కేసులు, ఐదుగురి మృతి
బీహార్ లో 64 పాజిటివ్ కేసులు, ఒకరి మృతి
ఒడిశాలో 54 కేసులు, ఒక మరణం
తెలంగాణాలో 503 పాజిటివ్ కేసులు, 14 మరణాలు
ఏపీలో 407 పాజిటివ్ కేసులు, 6 మరణాలు
మహారాష్ట్రలో 1895 కేసులు, 129 మరణాలు
ఢిల్లీలో 1069 కేసులు, 19 మరణాలు
తమిళనాడులో 969 కేసులు, 11 మరణాలు
రాజస్థాన్ లో 796 కేసులు, 8 మంది మృతి

- Advertisement -