ఢిల్లీలో 15 మందికి కరోనా

373
corona virus
- Advertisement -

ఢిల్లీలో 15 మంది ఇటలీ టూరిస్టులకు కరోనా వైరస్ వచ్చినట్లు ధృవీకరించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కరోనాపై ఉన్నత స్ధాయి సమావేశం నిర్వహించిన కేంద్రమంత్రి హర్షవర్ధన్..అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక వైద్యులను పంపిస్తున్నట్లు తెలిపారు. కరోనా విస్తరించకుండా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని విమానాశ్రయాల్లో భద్రత పెంచామని..కరోనా సోకిన ఇటలీ వాళ్లను ఆదేశం అనుమతించలేదని తెలిపారు. కరోనా కోసం ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నామని చెప్పారు.కరోనా విస్తరించకుండా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఇక కరోనా వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్న ఇటలీ టూరిస్టుల రక్త నమూనాలను సేకరించి.. పుణెలోని ల్యాబ్‌కు పంపించారు. ఈ పదిహేను మందికి కరోనా సోకినట్లు పుణె ల్యాబ్‌ నిర్ధారించింది. దీంతో 15 మంది పర్యాటకులను ఢిల్లీలోని చావ్లా ఐటీబీపీ కేంద్రానికి తరలించారు. 15 మందిలో ఒక భారతీయుడు ఉన్నారు.

వైరస్‌ సోకిన వారి సంఖ్య ఇండియాలో 28కి చేరింది. 28 మందిలో 14 మంది ఇటలీ పర్యాటకులు, ఒక ఇండియన్‌(ఇటలీ పర్యాటకుల గ్రూపులో ఉన్న వ్యక్తి), ముగ్గురు కేరళ వాసులు, ఒకరు ఢిల్లీ, ఒకరు ఆగ్రా, మరొకరు హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నారు. కేరళలోని ముగ్గురు వ్యక్తులు కరోనా వైరస్‌ నుంచి ఉపశమనం పొంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

- Advertisement -