యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో మంత్రి ఇంద్రకరణ్‌..

75
indrakaran reddy

యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జ‌రుగుతోంది. స్వామివారి కళ్యాణమహోత్సవంలో దేవ‌దాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దంప‌తులు పాల్గొన్నారు. ప్ర‌భుత్వం త‌ర‌పున‌ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు ఇంద్రకరణ్ రెడ్డి.

ఆల‌యానికి వ‌చ్చిన మంత్రి అల్లోల దంప‌తుల‌కు ఆల‌య ఈవో, అధికారులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లుక‌గా… అర్చ‌కులు వేదాశీర్వ‌చ‌నాలు అంద‌జేశారు. అనంత‌రం మంత్రి అల్లోల దంప‌తులు ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహెందర్ రెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకు‌ని స్వామివారి బ్రహ్మోత్సవ తిరు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు సమాచార శాఖ చీఫ్ కమిషనర్ సదా రాజారాం, కమిషనర్ బుద్ధ మురళి.