విదేశీ ప్రయాణీకులకు గడ్ న్యూస్..

58
passengers
- Advertisement -

అంతర్జాతీయ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది భారత ప్రభుత్వం. విదేశాలను నుండి వచ్చే ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు, క్వారంటైన్ నిబంధనలను ఎత్తేసింది. ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టుతో పాటు, వ్యాక్సినేషన్ పూర్తయినట్టు సర్టిఫికెట్లను అప్ లోడ్ చేస్తే సరిపోతుందని వెల్లడించింది.

దీంతో పాటు దేశంలో అడుగుపెట్టిన తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకుని, దాన్ని సువిధ పోర్టల్ లో అప్ లోడ్ చేయాల్సిన నిబంధనను కేంద్రం తొలగించింది. ప్రస్తుతం ఉన్న ఏడు రోజుల క్వారంటైన్ నిబంధనలను ప్రభుత్వం ఎత్తేసింది.

- Advertisement -