రాజ్యసభకు ఆలీ..!

104
jagan
- Advertisement -

ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఓ వార్త హాట్ టాపిక్గా మారింది. సినీ నటుడు ఆలీకి రాజ్యసభ సీటు ఖరారైందని ప్రచారం జోరందుకుంది. ఇండస్ట్రీలోని సమస్యలపై చర్చించేందుకు ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు సినీ ప్రముఖులు. చిరు,మహేష్‌, ప్రభాస్,రాజమౌళితో పాటు ఆలీ కూడా జగన్‌తో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా అలీని వారం రోజుల తర్వాత కలవాలని సూచించారు జగన్‌. దీంతో అలీకి రాజ్యసభ బెర్తు పై వార్తలు జోరందుకున్నాయి. మరో 3నెలల తర్వాత ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు ఎంపిక కానున్నారు. అందులో ఒక సీటు మైనార్టీలకు ఇచ్చే ఆలోచనలో ఉన్న జగన్‌… ఆ అవకాశం ఆలీకి కల్పించే అవకాశం ఉందట.

రెండున్నరేళ్లుగా పదవి కోసం ఎదురు చూస్తున్న ఆలీకి నిరాశే ఎదురుకాగా ఈసారి మాత్రం బంపర్ ఆఫర్ దక్కే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయాన్ని కొంతమంది వైసీపీ నేతలు కూడా ధృవీకరిస్తున్నారు.

- Advertisement -