2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. పార్లమెంట్ లో రెండోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మహిళగా నిర్మాలాసీతారమన్ చరిత్ర సృష్టించారు. 15వ ఆర్ధిక సంఘం రిపోర్టును సభలో ప్రవేశపెట్టారు నిర్మాలాసీతారామన్. దేశ ఆర్ధిక వ్యవస్ధ బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్. ఈసందర్భంగా నిర్మాలాసీతారామన్ మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు ఊతమిచ్చేలా బడ్జెట్ ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు చేరుతున్నాయన్నారు. ప్రపంచంలో ఇండియా ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ద. ఫిబ్రవరి 1నుంచి జీఎస్టీ నమోదు మరింత సరళతరం కానుంది. ఆయుష్మాన్ భవ అద్భుతమైన ఫలితానిస్తోంది. ఆర్ధిక సంస్కరణల్లో జీఎస్టీ ఒక చారిత్రాత్మక నిర్ణయం. ద్రవ్యోల్బణం అదుపులో ఉందన్నారు. జీఎస్టీ దేశ ఆర్ధిక వ్యవస్దను ఏకీకృతం చేసింది.
40కోట్ల మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. కొత్తగా 16లక్షల మంది టాక్స్ పేయర్స్ పెరిగారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా చర్యలు చేపట్టాం. యువతను మరింత శక్తిమంతం చేసేలా ప్రభుత్వం ప్రాధమ్యాలు ఉంటాయి. జీఎస్టీతో టోల్ ఆదాయం పెరిగింది. సంపద సృష్టిచడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఆర్ధిక ప్రగతికి సంస్కరణలు అవసరం అన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. కరువు జిల్లాల్లో రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. రైతులకు సోలార్ పంప్ సెట్లు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా 20లక్షల మంది రైతులకు సోలార్ పంప్ సెట్లు అందిస్తాం. 2022 సంవత్సరం నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు.
వ్యవసాయ అభివృద్దికి 16 అంశాలతో కార్యాచరణ చేపట్టాం. ఏప్రిల్ నుంచి కొత్త జీఎస్టీ విధానం తీసుకువస్తాం. నీటి లభ్యత లేని 100 జిల్లాలను గుర్తించాం. రైతుల కోసం కిసాన్ రైలు ప్రవేశపెడుతున్నాం. నాబార్డ్ రీ-ఫైనాన్స్ పథకం విస్తరిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం బడ్జెట్ రూపొందించాం అన్నారు. అన్ని వర్గాలకు ఊతమిచ్చేలా బడ్జెట్ ను రూపకల్పన చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం మొక్క మొదటి ప్రాధాన్యత వ్యవసాయం, సాగునీరు, గ్రామీనాభివృద్ది..రెండో ప్రాధాన్యతః వైద్యం, పారిశుధ్యం, త్రాగునీరు, మూడో ప్రాధాన్యతః విద్య, శిశు సంక్షేమం, బీడు భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు పెట్టుబడి సాయం చేస్తామన్నారు. జీఎస్టీ అమలు తర్వాత సామాన్య ప్రజల ఆదాయం పెరిగిందన్నారు.