ఇవాళ కేంద్ర బడ్జెట్ 2023-24ను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్నారు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్. ఐదోసారి ఆమె బడ్జెట్ ప్రవేశ పెట్టనుండగా మోడీ సర్కార్‌కు ఇదే చివరి, పూర్తి స్ధాయి బడ్జెట్ కానుంది. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్ ఎలా ఉండనుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
ఇవాళ ఉదయం 9 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. అక్కడి నుంచి ఉదయం 10 గంటలకు పార్లమెంట్ కు చేరుకుంటారు. ఉదయం 10:30 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. కేబినెట్ అమోదం అనంతరం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ 2023-24ను సభ ముందు ఉంచనున్నారు నిర్మలా.
ఈ సారి బడ్జెట్ లో ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించవచ్చని అంతా భావిస్తున్నారు. 60 ఏళ్ల లోపు ఉన్న వారి వార్షిక ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని ఐదు లక్షలకు పెంచాలని సామాన్యులు కోరుకుంటున్నారు. ధరలు గణనీయంగా పెరిగినందున హోమ్ లోన్లపై విధించే పన్ను పరిమితులను సైతం సవరించాలని..సొంతింటి కలను నెరవేర్చాలని చూస్తున్నవారికి ఈ సారి బడ్జెట్ లో తీపి కబురు అందవచ్చని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..