టీఎస్‌డబ్ల్యూఆర్ఈఎస్‌లో ప్రవేశాలు…

31
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ గురుకుల సైనికుల పాఠశాలలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. మిలిటరీ ఎడ్యుకేషన్ త్రివిధ దళాల్లో అధికారుల నియామక ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కరీంనగర్ జిల్లాలోని రుక్మాపూర్‌లో ఏర్పాటు చేశారు. ఇందులో బాలుర కోసం ప్రత్యేకంగా ప్రారంభించారు. ఈ పాఠశాల్లో వచ్చే విద్యా సంవత్సరంలో ఆరవ తరగతి ఇంటర్‌లో సీట్ల భర్తీకి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నేటి నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది.

ఆరవ తరగతిలో (80సీట్లు),ఇంటర్‌(ఎంపీసీ-80సీట్లు) ప్రవేశాలకు ఆర్హులైన బాలురు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. రాత పరీక్షలు శారీరక సామర్ధ్య వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 15లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. రాత పరీక్ష ఫిబ్రవరి 26న ఉంటుందని పేర్కొంది.

ముఖ్యమైన తేదీలు…

  • దరఖాస్తులు ప్రారంభం: జనవరి31, 2023
  • ఆఖరి గడువు :ఫిబ్రవరి 15
  • హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్: ఫిబ్రవరి 17
  • రాత పరీక్ష తేదీ :ఫిబ్రవరి 26
  • రాత పరీక్ష ఫలితాలు విడుదల :మార్చి 8
  • ఫిజికల్ ఫిట్‌నెస్‌ పరీక్ష: మార్చి 10,12,14,18,19
  • తుది ఫలితాలు: మార్చి 28
  • అడ్మిషన్లు ప్రారంభం :మార్చి30

ఇవి కూడా చదవండి…

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు..

జూన్‌లో మెయిన్స్ పరీక్షలు…

పంజాబ్‌లో కొత్త పన్ను…

- Advertisement -